Allu Arjun: ‘పుష్ప ది రైజ్’ కోసం 12 గంటలు నాన్ స్టాప్ గా కష్టపడ్డాడట..!

ఒకే పాటలో హీరో రకరకాల వేరియేషన్స్ తో కనిపించడం మన గతంలో కూడా చూసాం. ‘మల్లీశ్వరి’ సినిమాలో ‘జన్మ జన్మల’ పాటలో వెంకటేష్ రకరకాల గెటప్ లలో కనిపిస్తారు. తర్వాత ‘ఆగడు’ లో ‘సరోజా’ పాటలో కూడా మహేష్ బాబు ఇంచుమించు అలానే కనిపిస్తాడు. ఇలాంటి షాట్ లు చేయడం అంత ఈజీ కాదు. ఇటీవల సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ లో కూడా ఇలాంటి పాట ఒకటి ఉంటుంది.

‘ఏయ్ బిడ్డా ఇది నీ అడ్డా’ అంటూ సాగే ఈ పాటలో అల్లు అర్జున్ ఒకే షాట్ లో చాలా గెటప్ లలో కనిపిస్తాడు. ఇది మనకి మూడున్నర నిమిషాల నిడివి గల పాటే అయినప్పటికీ.. ఈ పాట కోసం బన్నీ ఏకంగా 12 గంటలు కష్టపడ్డాడట. ఈ విషయాన్ని ‘పుష్ప’ నిర్మాతలు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.” ‘ఏయ్ బిడ్డా’ లో.. ఈ ఒక్క షాట్ కోసం అల్లు అర్జున్ దాదాపు 12 గంటలు కష్టపడ్డాడు.

కేవలం ఆ ఒక్క షాట్ కోసం అల్లు అర్జున్… 24 రకాల కాస్టూమ్స్ మార్చి మార్చి ధరించాల్సి వచ్చింది. అంతేకాదు ఫేస్లో వేరియేషన్స్ కూడా మార్చాలి కాబట్టి ఆ ఒక్క షాట్ కోసం అంత టైమ్ కేటాయించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకి షూటింగ్ మొదలుపెడితే అర్ధరాత్రి 2 గంటలు టైం పట్టింది. బన్నీ నిజంగానే ఐకాన్ స్టార్ అనడానికి ఇది నిదర్శనం” అంటూ వారు చెప్పుకొచ్చారు. బన్నీ పడ్డ కష్టానికి ఫలితం ఎలా వచ్చిందో అందరకీ తెలిసిందే.

సౌత్ తో పాటు నార్త్ లో కూడా ‘పుష్ప’ తన సత్తాని చూపించాడు. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా కొంత మేర నష్టాలు వచ్చాయి కానీ.. మిగిలిన అన్ని భాషల్లోనూ ‘పుష్ప’ మంచి లాభాల్ని అందించింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus