Allu Arjun, Sukumar: పుష్ప 2 వల్ల సుక్కు చేతిలో లాక్ అయిన బన్నీ?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక హిందీలో ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో పలు మార్పులు చేస్తున్నారు. ఇకపోతే ఈపాటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదలయ్యేవి. ముందుగా ఈ సినిమా ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి దసరాకి విడుదల చేయాలని భావించారు. ఇది కుదరని పక్షంలో ఈ ఏడాది చివరికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు షూటింగ్ పనులను ప్రారంభించకపోవడంతో ఎంత లేదన్న ఈ సినిమా కోసం

మరొక ఏడాది పాటు సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ విధంగా సుకుమార్ చేతిలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం లాక్ అయ్యారు. ఈ సినిమా కోసం తన మేకోవర్ మార్చుకోకుండా అల్లు అర్జున్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అనుకున్న సమయానికి ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించి ఉంటే వచ్చే ఏడాది అల్లుఅర్జున్ మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు.

అయితే సుకుమార్ కారణంగా అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారు. తద్వారా ఆయన ఎంతో నష్ట పోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ స్క్రిప్ట్ పనుల కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని, ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus