పాతబస్తీలో పచార్లు చేస్తోన్న పంతులు..!

పాతబస్తీ అనగానే ఎవరికైనా ఠక్కున జ్ఞప్తికి వచ్చేది హైదరాబాద్ లోని నాలుగొందల ఏళ్ల కిందట నిర్మించిన ఛార్మినార్. దాని పరిసర ప్రాంతాలైన మక్కా మసీదు, చౌమహల్లా పాలస్ ఇతరత్రా. ఇంత తెలిశాక అది ముసల్మాన్లు ఉండేచోటని తెలీదంటే సూర్యుడు నల్లగా ఉన్నాడన్నట్టు ఉంటుంది. నమాజు చదివే చోట, మంత్రాలు చదివే పంతులు ఎందుకున్నట్టు..?, మసాలా బిర్యానీ, మేక హలీం ఘుమఘమలాడేచోట పాయసం, దద్దోజనం తినే పంతులుకి ఏం పని ఉంటుంది..? వంటి రకరకాల అనుమానాలు మీలో మెదులుతున్నాయి కదూ..! దానికి సమాధానం కావాలంటే దర్శకుడు హరీశ్ శంకర్ ని సంప్రదించాల్సిందే.

ఆ పంతులుతో అక్కడ పచార్లు కొట్టిస్తున్నది అతగాడి మరి. ఇంతకీ ఆ పంతులెవరో పసిగట్టారా..? ఇప్పటికైతే లాల్చీ, ధోవతి ధరించి ఉన్నాడు గానీ అతడు అచ్చంగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే సుమా..! హరీశ్ – అల్లు అర్జున్ కలయికలో వస్తున్న ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా కోసం పలు సన్నివేశాలను పాతబస్తీలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదికి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ లో త్వరలోనే హీరోయిన్ పూజ హెగ్డే చేరనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus