కూతురితో కలిసి స్టైలిష్ స్టార్ అల్లరి

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో అయినప్పటికీ తన ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి ఒక నార్మల్ పర్సన్ గా మారిపోతాడు. బాధ్యత గల తండ్రిగా బన్నీ తన పిల్లలను చూసుకునే విధానం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బన్నీ షూటంగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా కాస్త గ్యాప్ దొరికితే చాలు తన పిల్లల కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. ఇక రీసెంట్ గా పుష్పకు సంబందించిన ఒక షెడ్యూల్ ను ఫినిష్ చేసిన బన్నీ కాస్త బ్రేక్ తీసుకున్నాడు.

గత రెండు మూడు నెలలుగా తీరిక లేకుండా గడిపిన స్టైలిష్ స్టార్ రీసెంట్ గా భార్య పిల్లలతో కలిసి దుబాయ్ కు వెళ్ళాడు. అక్కడ ఫేమస్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన అల్లు ఫ్యామిలీ కొన్ని పోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక బన్నీ తన కూతురు అర్హతో కలిసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అందుకు సంబందించిన ఒక వీడియోను కూడా భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇది దుబాయ్‌లోని చిల్డ్రన్స్‌ ప్లే మ్యూజియం ఎయిర్‌ గ్యాలరీలో తీసిన వీడియో.

అయితే బన్నీ కూతురితో పాటు చిన్న పిల్లాడిలా మారిపోయినట్లు అనిపిస్తోంది. దీంతో ఆ వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపొయింది. ఇక మరో వారం పాటు అక్కడే దుబాయ్ లో విశ్రాంతి తీసుకోనున్న బన్నీ పుష్పకు సంబందించిన నెక్స్ట్ షెడ్యూల్ ను వచ్చే నెల స్టార్ట్ చేయనున్నారట.

Most Recommended Video


పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus