Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Advertisement

సినిమా షూటింగ్‌ మొదలై, ఓ షెడ్యూల్‌ అవ్వగానే సినిమా కాన్సెప్ట్‌ ఏంటి అనేది చెప్పేస్తుంటారు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అయితే ‘వారణాసి’ విషయంలో అలా జరగలేదు. సినిమా షూటింగ్‌ చాలా వరకు జరిగాక అప్పుడు గ్లింప్స్‌ రిలీజ్‌ చేసి సినిమా స్పాన్‌ ఏంటి అనేది చెప్పారు. కథ గురించి చూఛాయగా చెప్పారు. అయితే ఎక్కడా క్లియర్‌ సమాచారం ఇవ్వలేదు. ఎవరి పాత్రలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది మాత్రం తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాకు పని చేస్తున్న ఓ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ తన వెబ్‌సైట్‌లో ‘వారణాసి’ సినిమా కథను లీక్‌ చేసేసింది.

Varanasi

‘వారణాసి’ సినిమా టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌లో రూపొందుతోంది అని ఇప్పటికే రాజమౌళి చెప్పేశారు. ఇక కథ విషయానికొస్తే రుద్ర అనే శివభక్తుడు (మహేశ్ బాబు) కాలాన్ని అధిగమించే ఒక ప్రమాదకర యాత్రకు బయలుదేరతాడు. కనిపించకుండా పోయిన అపారమైన శక్తి కలిగిన ఓ విశ్వ కళాఖండం/ ఆభరణాన్ని కనుగొనే ప్రయత్నమే అతని లక్ష్యం. ఈ క్రమంలో శతాబ్దాలుగా మరుగున పడిన ప్రాచీన రహస్యాల గురించి తెలుసుకుంటూ, తెలియజేస్తూ సాగుతాడు. ఈ క్రమంలో తను చేపట్టిన మిషన్‌ వెనుక ఉన్న అసలు నిజాన్ని గ్రహిస్తాడు.

తనని ఈ మిషన్‌ కోసం పంపిన కుట్రలు, కుతంత్రాలు చేసే ఓ దివ్యాంగ మేధావి కుంభ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) గురించి తెలుసుకుంటాడు. అప్పుడు కుంభను ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో మందాకిని (ప్రియాంక చోప్రా) ఎలా సాయపడింది అనేదే సినిమా కథ అని ఆ వెబ్‌సైట్‌ బట్టి తెలుస్తోంది. అయితే ఇలాంటి కథలు లీక్‌ అవ్వడం పెద్ద కొత్తేమీ కాదు. గతంలో కొన్ని సినిమాలకు ఇలా జరిగింది కూడా.

ఈ కథను చూసి ఇంతేనా అనుకోవద్దు. ఎందుకంటే చిన్న ఈగను పట్టుకుని అంత పెద్ద సినిమా తీశారు రాజమౌళి. ఇప్పుడు ఈ కథతో ఓ విజువల్‌ వండర్‌ తీయకుండా ఉంటారా. ఆ సంగతేంటో తేలాంటే రాజమౌళి చెప్పిన ‘వారణాసి’ రిలీజ్‌ డేట్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7 రావాల్సిందే.

లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus