మహేష్ ను ఫాలో అవుతున్న బన్నీ

టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్ ల వైపు దృష్టి పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అక్కినేని నాగార్జున తో మొదలైన ఈ ట్రెండ్ ను మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ , మంచు విష్ణు లాంటి హీరోలు బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా జూ.ఎన్టీఆర్, నాని వంటి హీరోలు హోస్ట్ గా వ్యవహరిస్తూ సినిమాలతో మాత్రమే కాకుండా మిగిలిన బిజినెస్ లలో పాల్గొంటున్నారు.

తాజాగా మహేష్ బాబు కూడా ‘ఏ.ఎం.బి సినిమాస్’ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఏషియన్ సినిమాస్’ తో కలిసి మహేష్ ఈ సూపర్ ప్లెక్స్ బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. మహేష్ భార్య నమ్రత ఈ బిజినెస్ వ్యవహారాలు చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కూడా మల్టీ ప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడట. ‘ఏషియన్ సినిమాస్’ సునీల్ నారంగ్ తో కలిసి అల్లు అర్జున్ హైదేరాబద్ లోని అమీర్ పేట్ ‘సత్యం థియేటర్’ ను మల్టీ ప్లెక్స్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది . ‘ఏ.ఏ.ఏ సినిమాస్ ‘ అని ఈ థియేటర్ ని మల్టీ ప్లెక్స్ లాగా లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. సాధారణంగా అమీర్పేట్ ఏరియాల్లో యూత్ ఎక్కువగా ఉండటం తో ఈ బిజినెస్ క్లిక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయంటూ ఫిల్నగర్ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus