Allu Arjun: ఆ సెంటిమెంట్ ప్రకారం పుష్ప2 ఇండస్ట్రీ హిట్ కానుందా?

స్టార్ హీరో బన్నీ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో పుష్ప ది రైజ్ ఒకటనే సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి పోస్టర్ డిజైన్ కోసం షూటింగ్ జరుగుతుండటం గమనార్హం. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన అవినాష్ గోవరికర్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం గమనార్హం.

అయితే పుష్ప ది రైజ్ మూవీ కూడా ఇదే విధంగా ఫోటోషూట్ తో మొదలైంది. ఆ సెంటిమెంట్ ను బట్టి పుష్ప ది రూల్ మూవీ విషయంలో కూడా బన్నీ ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. అందువల్ల ఈ సినిమా కూడా అంచనాలను మించి సక్సెస్ సాధించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప2 మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే బన్నీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

పుష్ప ది రూల్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దాదాపుగా 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక, అనసూయ పాత్రలకు పుష్ప ది రైజ్ సినిమాతో పోల్చి చూస్తే పుష్ప ది రూల్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమాపై బన్నీ చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రెండేళ్ల సమయం కేటాయించడం గమనార్హం. సుకుమార్ సైతం ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో సమయం కేటాయించి ఈ సినిమా సక్సెస్ సాధించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పుష్ప ది రూల్ తర్వాత బన్నీ నటించబోయే సినిమాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. సినిమాసినిమాకు అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus