అల్లు అర్జున్ కి నిద్ర పట్టనివ్వని జనతా గ్యారేజ్ విజయం

ప్రతి రంగంలో పోటీ అనేది ఉంటుంది. ఆ పోటీ సినీ ఫీల్డ్ లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ పోటీ కొన్నిసార్లు విజయాన్ని ఇస్తే.. మరికొన్ని సార్లు పరువును తీస్తుంది. బన్నీ విషయంలో రెండోదే జరిగింది. సరైనోడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పటి తరం హీరోలో నంబర్ వన్ గా అల్లు అర్జున్ నిరూపించుకున్నారు. తన సినిమా కలక్షన్స్ ని ఏది దాటలేదని సంబరాల్లో ఉన్న స్టైలిష్ స్టార్ కి జనతా గ్యారేజ్ గట్టి షాక్ ఇచ్చిందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఆ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం, మలయాళం లోను మంచి వసూళ్లు రాబట్టడం చూసి బన్నీ ఆశ్చర్య పోయారని వెల్లడించింది.

అంతే కాదు లింగు స్వామితో హడావిడిగా సినిమా ప్రారంభించడానికి వెనుకున్న కారణం కూడా యంగ్ టైగరే అని రాసింది. అదెలా అంటే.. కొన్ని రోజుల క్రితం తమిళ దర్శకుడు లింగు స్వామి అల్లు అర్జున్ కి కథ చెప్పాడు. ఆ కథ నచ్చినా వెంటనే ఒకే చెప్పకుండా బన్నీ హోల్డ్ లో పెట్టాడు. అతనికి  ఏమి చెప్పకుండా హరీష్ శంకర్ తో దువ్వాడ జగన్నాధం సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆ డైరక్టర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి అదే కథను చెప్పాడు. తారక్ కి ఆస్టోరీ నచ్చిందని, ఒకే చెప్పేలా ఉన్నాడనే వార్త బన్నీ చెవిన పడగానే, వెంటనే లింగు స్వామిని పిలిచి అదే సినిమా చేస్తానని చెప్పడమే కాకుండా, ఆ కథ మళ్లీ ఎన్టీఆర్ కి వెళుతుందని భయపడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు చెన్నై పత్రికలు కథనాలు వెలువరించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా కోసం ఇప్పుడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చూస్తుంటే ఎన్టీఆర్ కి బన్నీ బయపడినట్లే అనిపిస్తోంది.

Allu Arjun Sarrinodu Movie not in Top Five Collections of Tollywood - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus