అల్లు అర్జున్ ప్లానింగే వేరబ్బా.. లైనప్ బాగుంది..!

  • February 24, 2020 / 09:48 PM IST

ఈ మధ్యన అల్లు అర్జున్ సెలెక్ట్ చేసుకునే సినిమాల ప్లానింగే చాలా సెపరేట్ గా ఉంటుంది. దర్శకుల ట్రాక్ రికార్డుని పట్టించుకోవట్లేదు.. స్క్రిప్ట్ పక్కాగా ఉందా లేదా.. అనేదే చెక్ చేసుకుని తన బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే కథల్నే ఎంచుకుంటున్నాడు. కథ అంతగా ఇంప్రెస్స్ చెయ్యకపోతే ఎంత పెద్ద క్రేజీ డైరెక్టర్ సినిమాని అయినా పక్కన పెట్టేస్తున్నాడు. విక్రమ్ కుమార్ తో సినిమా చేయాల్సి ఉంటే దానిని రిజెక్ట్ చేసాడు. ఇక తమిళ టాప్ డైరెక్టర్స్ లింగు స్వామి, మురుగదాస్ ఆఫర్స్ ను పక్క పెట్టాడు. వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ ను కూడా అటకమీద పడేసాడు. అయితే చిరంజీవి, చరణ్ లకు ప్లాప్ ఇచ్చిన దర్శకులకి మాత్రం ఛాన్స్ లు ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే రాంచరణ్ కు ‘వినయ విధేయ రామ’ వంటి రాడ్ సినిమా ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బోయపాటి ఈలోపు బాలయ్యతో సినిమా కంప్లీట్ చేస్తాడట. ఆ వెంటనే వీరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ తో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి.. ప్రశంసలు అయితే అందుకున్నాడు కానీ.. సినిమా మాత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. అయితే ఈ దర్శకుడితో కూడా సినిమా చేయడానికి బన్నీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. గతంలో ఈ దర్శకులు బన్నీకి ‘రేసు గుర్రం’ ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు కాబట్టి… అందులోనూ మాస్ పల్స్ బాగా క్యాచ్ చేయడంలో ఆరితేరిన వారు కాబట్టి వీళ్లతో సినిమాలు చేయడమే కరెక్ట్ అని బన్నీ భావిస్తున్నాడట. ఏమైనా ఆ దర్శకులకి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus