క్యాన్సర్ తో కన్నుమూసిన అల్లు అర్జున్ వీరాభిమాని

సినీ హీరోలు తమ అభిమానులను కుటుంబసభ్యులుగానే భావిస్తారు. వారికి కష్టమొస్తే వెంటనే స్పందిస్తుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలం నుంచి నేటి హీరోలవరకు అందరూ ఫ్యాన్స్ కి అండగా నిలిచినవాళ్లే. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ .. తమ అభిమానుల ఇళ్లకు సైతం వెళ్లి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య అల్లు అర్జున్ కూడా తన అభిమాని  దేవ్ సాయి గణేష్ బోన్ క్యాన్సర్ తో మంచాన పడి ఉంటే అనకాపల్లికి వెళ్లి అతనికి మనో దైర్యం ఇచ్చారు.

అంతేకాదు మెరుగైన వైద్యానికి పదిలక్షల సాయం చేశారు. నా పేరు సూర్య ప్రమోషన్ లో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్ కోసం ఒకరోజు కేటాయించారు. ఇంతాచేసిన విధి ముందు తలవంచక తప్పలేదు. ఈరోజు దేవ్ సాయి గణేష్ ని మృత్యువు తీసుకెళ్ళిపోయింది. డాక్టర్లు విశ్వప్రయత్నం చేసినప్పటికీ గణేష్ శరీరం సహకరించలేదని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని దగ్గరుండి చూసుకున్న సన్నిహితులు వెల్లడించారు. ఈ విషయం బన్నీతో పాటు ఇతర హీరోలని సైతం కలిచివేసింది. చిన్నవయసులోనే దేవ్ సాయి మరణించాడని జీరించుకోలేకపోతున్నారు. అతని కుటుంబసభ్యులకు సంతాపం తెలుపుతున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus