Allu Arjun, Rajamouli: రాజమౌళి లైనప్‌లో ఐకాన్‌ స్టార్‌ వస్తాడా?

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ఏ హీరోకు ఉండదు చెప్పండి. అలాగే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఏ దర్శకుడుకి ఉండదు చెప్పండి. అలాగే ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తే… చూడాలని ఏ ప్రేక్షకుడికి ఉండదు చెప్పండి. ఇదంతా బాగుంది కానీ… ఆ కాంబినేషన్‌ కుదరాలి కదా అంటారా. అయితే మీరు అనుకుంటున్న జోడీ కుదిరేలా కనిపిస్తోంది. బన్నీ మాటలు వింటుంటే… త్వరలోనే ఈ సినిమా సెట్‌ అయ్యేలా అనిపిస్తోంది.

‘పుష్ప’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసి టీమ్‌ను విష్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు.. బన్నీ, రాజమౌళి మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ… ఇటీవల అల్లు అర్జున్‌ దగ్గర మరి రాజమౌళితో సినిమా ఎప్పుడు అని అడిగితే ఓపెన్‌ అయ్యాడు. రాజమౌళితో సినిమా చేయాలని ఏ హీరోకి ఉండదు చెప్పండి. అందుకే నేను కూడా ‘మీతో కలిసి సినిమా చేయాలనుంది’ అని అడిగా. దానికి ఆయన ‘తప్పకుండా చేద్దాం, నేను సినిమా చేయాలనుకునే హీరోల్లో నువ్వూ ఒకడివి’ అని అన్నారట.

దీంతో రాజమౌళి – బన్నీ కాంబినేషన్‌పై చర్చ మొదలైంది. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వా మహేష్‌బాబుతో సినిమా చేయాల్సి ఉంది. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుంది అని టాక్‌. ఈ లోపు రాజమౌళి ఆ సినిమా కథ రెడీ చేసుకుంటారట. ఆ తర్వాత బన్నీ సినిమాకు ప్లాన్స్‌ వేస్తారని తెలుస్తోంది. మరి మహేష్‌ సినిమా ఎన్నేళ్లు పడుతుందో, బన్నీ ఎప్పుడు జక్కన్న హీరో అవుతాడో చూడాలి.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus