Allu Arjun, Liger: లైగర్ పక్కా హిట్.. బల్లగుద్ది చెప్పిన సుకుమార్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 25 వ తేదీ విడుదల కానుంది. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ సుకుమార్ పూరి జగన్నాథ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుకుమార్ పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తూ అసలు లైగర్ సినిమా స్టార్ట్ అవ్వడానికి మూలం ఏంటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ సమాధానం చెబుతూ ఈ సినిమాకు మూలం అల్లు అర్జున్ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.ఇద్దరమ్మాయిలు సినిమా సమయంలో అల్లు అర్జున్ నాతో మాట్లాడుతూ ఒక హాలీవుడ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. ఆ డైరెక్టర్ హీరో ఏం చేసినా లోపం పెడుతూనే ఉంటారు. మీరు కూడా అలా రాయొచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. బన్నీ ఈ విధంగా చెప్పేసరికి అప్పటికే చెవిటి పాత్రలోను గుడ్డి పాతలోను సినిమాలు వచ్చాయి.

నత్తి పాత్ర అయితే ఎలా ఉంటుందని బన్నీని అడగగా చాలా బాగుంటుందని సలహా ఇచ్చాడు అంటూ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాకు మూలం అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చారు. ఇక ఎప్పటినుండో మార్షల్ ఆర్ట్స్ పై సినిమా చేయాలని ఉండడంతో నత్తితో ఈ సినిమా చేశాననీ పూరి చెప్పడంతో ఈ మాటలు విన్న సుకుమార్ ఈ సినిమా పక్క హిట్ అవుతుందని బల్లగుద్ది మరి చెప్పాలి.

ఈ సినిమా పై కొత్త ఆలోచనలు చేయడం కోసం మీకు చాలా టైం దొరికింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్లు కొల్లగొట్టడం పక్క అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరి లైగర్ విషయంలో సుకుమార్ చెప్పినది నిజం అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు మాత్రమే వేచి చూడాలి. మొత్తానికి లైగర్ సినిమాకు మూలం అల్లు అర్జున్ అని తెలియడంతో అల్లు అర్జున్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus