Pushpa: బన్నీ లుక్ మార్పు వెనుక అసలు కారణమిదేనా?

బన్నీ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ కు రెట్టింపు బడ్జెట్ తో పుష్ప ది రూల్ తెరకెక్కుతుండగా బన్నీ ప్రస్తుతం ఈ సినిమాపై మాత్రమే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా పుష్ప ది రైజ్ ను మించి ఉండేలా సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే ఫస్ట్ పార్ట్ తో పోల్చి చూస్తే పుష్ప ది రూల్ లో బన్నీ లుక్ లో స్వల్పంగా మార్పులు చేశారని తెలుస్తోంది. పుష్ప్ ది రైజ్ లో గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ పుష్ప ది రూల్ లో మాత్రం గడ్డం ట్రిమ్ చేసి కనిపించనున్నారని బోగట్టా. పుష్ప ది రైజ్ లో బన్నీ లుక్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించిన నేపథ్యంలో సుకుమార్ పుష్ప రాజ్ పాత్ర లుక్ కు సంబంధించి స్వల్పంగా మార్పులు చేశారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఫస్ట్ పార్ట్ తో పోల్చి చూస్తే రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు సెకండాఫ్ లో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని బోగట్టా. పుష్ప ది రూల్ లో కథను మలుపు తిప్పే విధంగా శ్రీవల్లి పాత్ర ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా ఈ సినిమా ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రూల్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం కష్టమేమీ కాదు. వేగంగానే ఈ సినిమా షూటింగ్ జరిగే విధంగా దర్శకుడు సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus