మహేష్ బాబు బాటలోనే వెళుతున్న అల్లు అర్జున్

మార్పు లేకుంటే స్వర్గం కూడా బోర్ కొట్టేస్తుందని ఓ మహా కవి అన్నారు. అలాగా చిత్ర పరిశ్రమలో అనునిత్యం కొత్తదనం ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. కాసులు కురుస్తాయి. కొన్నేళ్ల క్రితం ఆడియో వేడుకలు సినిమా పబ్లిసిటీ ప్రధాన మార్గం అయ్యేవి. ఇప్పుడు ప్రీ రిలీజ్ కార్యక్రమాలు వచ్చి చేరాయి. ఇదివరకు సినిమా రిలీజ్ కి ఒక వరం రోజుల ముందు అన్ని మీడియాల్లో ఇంటర్వ్యూలతో హీరోలు హడావుడి చేసేవారు. పలు టీవీషోల్లోనూ సందడి చేసేవారు. తాజాగా స్టైల్ మార్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి పబ్లిసిటీలోకి దిగుతున్నారు. భరత్ అనే నేను సినిమా రిలీజ్ వరకు ప్రచారానికి కొంచెం దూరంగా ఉన్న మహేష్ బాబు.. రిలీజ్ తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టారు. పైగా అభిమానులతో కలిసి ముచ్చట్లలో పాల్గొన్నారు.

ఇదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆలోచిస్తున్నారు. నా పేరు సూర్య శుక్రవారం రిలీజ్ కానుంది. సాధారణంగా అయితే నిన్న, ఈరోజు బన్నీ క్షణం తీరికలేకుండా టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాటనట్టినీ హోల్డ్ లో పెట్టారు. ఇప్పటివరకు చేసిన ప్రచారం చాలని.. మిగతాది రిలీజ్ తర్వాత చూసుకుందామని చెప్పినట్లు సమాచారం. అలాగే సినిమాలోని సన్నివేశాల గురించి, డైలాగుల గురించి మాట్లాడుకోవడానికి బాగుంటుందని భావిస్తున్నారు. పైగా అనేక విభిన్న కార్యక్రమాలు చేపట్టేందుకు అల్లు అర్జున్ ప్లాన్ చేసినట్లు సమాచారం. సినిమా కొంచెం బాగుంటే చాలు.. అల్లు అర్జున్ పోస్ట్ పబ్లిసిటీ కలెక్షన్లను పెంచడానికి దోహదపడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus