హై ఎమోషనల్ డ్రామాలో బన్నీ లుక్ హైలెట్ అంట..!

  • April 29, 2019 / 12:40 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ విరామం లేకుండా జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్ కొత్తగా ఉంటుందట. డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుండీ హెయిర్ స్టైల్ వరకూ బన్నీ కొత్తగా కనిపిస్తాడని సమాచారం. ‘జులాయి’ తరువాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో బన్నీని కొత్త గా చూపించాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా సరికొత్తగా చూపించనున్నాడట.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’ అలాగే బన్నీతో ‘డీజే’ చిత్రాల్లో నటించింది పూజా. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా నటిస్తుంది. అల్లు అరవింద్, చినబాబు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది. తండ్రి అనుకున్న ప్రతీ చిన్నవిషయాన్ని సీరియస్ గా తీసుకుని దాన్ని నిజం చేయడానికి ఆరాటపడే కొడుకు పాత్రలో బన్నీ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో సుశాంత్, నవదీప్ లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తుందని టాక్ నడుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus