Allu Arjun: మరో మల్టీప్లెక్స్ దిశగా బన్నీ అడుగులు.. ఈ హీరో ప్లాన్ సూపర్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. బన్నీ ఆసియన్ సినిమాస్ నిర్మించిన ఎఎఎ సినిమాస్ హైదరాబాద్ నగరంలో ఎంతో పాపులర్ అనే సంగతి తెలిసిందే. ఎఎఎ సినిమాస్ విశాఖలో కూడా ఏర్పాటు కాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు, అగ్రిమెంట్స్ జరుగుతున్నాయని మరికొన్ని రోజుల్లో పూజ నిర్వహించి పనులు మొదలుపెట్టనున్నారని భోగట్టా. మరో మల్టీప్లెక్స్ దిశగా బన్నీ అడుగులు పడుతుండటం ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విశాఖలోని ఇనార్బిట్ మాల్ లో ఆరు లేదా ఏడు స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు కానుందని భోగట్టా. ఇంటీరియర్ డిజైన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. విశాఖలో ఎఎఎ మల్టీప్లెక్స్ ఓపెన్ అయితే ఉత్తరాంధ్ర కలెక్షన్లు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు. విశాఖలో ఇప్పటికే మూడు మల్టీప్లెక్స్ లు ఉండగా వాటికి అదనంగా ఈ మల్టీప్లెక్స్ కూడా జత కానుంది.

బన్నీ ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు మల్టీప్లెక్స్ లను నిర్మిస్తూ తెలివిగా అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే విధంగా బన్నీ పెట్టుబడులు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు బన్నీ ఈ ఏడాది పుష్ప2  (Pushpa 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పుష్ప2 సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మేకర్స్ నుంచి స్పష్టత వచ్చింది.

పుష్ప2 సినిమా రికార్డ్ స్థాయి స్కీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాలో బన్నీ సరికొత్త లుక్స్ లో కనిపించనున్నారని భోగట్టా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus