పుష్ప పక్కా హిట్ బ్రో..రాస్కో..!

  • December 30, 2020 / 06:35 PM IST

పుష్ప సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతోంది. లీకైన పోస్టర్స్ చూస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ పండగ చేస్కుంటున్నారు. అంతేకాదు, రీసంట్ గా సామ్ జామ్ లో బన్నీ ఇచ్చిన ఇంటర్య్వూ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తూ హైలెట్ అయ్యింది. నిజానికి పుష్ప అనే టైటిల్ మొదట్లో ఫ్యాన్స్ కి నచ్చకపోయినా సుకుమార్ సినిమాకి ఖచ్చితంగా ఒక లెక్క ఉంటుందని అందుకే ఈ పేరు పెట్టి ఉంటాడని ఫిక్స్ అయ్యారు. టైటిల్ కాదు కంటెంట్ చూడండి అంటూ కామెంట్స్ కూడా చేశారు.

ఇక ఇందులో చాలా రగ్డ్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ బలమైన కంటెంట్ ఉన్న కథని నమ్ముకుని దిగుతున్నట్లుగానే ఉంది. కాలికి ఆరువేళ్లు , ముక్కు పక్కన పెద్ద పుట్టుమచ్చ, మాసిపోయిన చొక్కా, చెదిరిపోయిన జుట్టు, చేతికి రాగి కడియం , మెడలో రాగిబిళ్ల ఇలా ఒక ప్రత్యేకమైన లుక్ తో బన్నీ రెచ్చిపోతున్నాడు. అంతేకాదు, పక్కా ప్రొఫెషనల్ చిత్తూరు యాసలో డైలాగ్స్ చెప్తూ రెచ్చిపోతున్నాడట. అయితే, ఇప్పుడు పుష్ప సినిమాలో ట్విస్ట్ ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

ఈ లెక్కలమాస్టారి లెక్కేంటి అనేది ఆసక్తిగా మారింది. అప్పటివరకూ చాలా రఫ్ గా కనిపించే అల్లు అర్జున్ సడన్ గా ఏ ఫారెస్ట్ పోలీసో అయిపోయి ట్విస్ట్ ఇస్తాడా.., లేదా క్లైమాక్స్ లో మరేదైనా ట్విస్ట్ ఉందా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా ఆల్బమ్ ని ఒక రేంజ్ లో రెడీ చేశాడట. అందుకే, సినిమా పక్కా హిట్ బ్రో.. రాస్కోండి అంటున్నారు ఫ్యాన్స్. అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus