‘పుష్ప: ది రైజ్’ చిత్రంతో దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు అల్లు అర్జున్.పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ చూపించిన మేనరిజానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన మూవీ ఇది. బన్నీ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ కూడా రీజినల్ మూవీస్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డులకెక్కింది.
ఇదిలా ఉండగా..అల్లు అర్జున్, న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో భారతదేశానికి గ్రాండ్ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించడం, పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా SIIMA అవార్డును గెలుచుకున్నందుకు అల్లు అర్జున్… కు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ బిరుదు దక్కింది. పుష్ప: ది రైజ్‌లో అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు గాను బుధవారం నాడు ఎంటెర్టైనమెంట్ విభాగంలో CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల తర్వాత ఉత్తరాదికి చెందిన దక్షిణ భారత నటుడికి ఈ పురస్కారం లభించడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అల్లు అర్జున్ కు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేశారు.అవార్డు స్వీకరించిన తర్వాత ‘ఇండియన్ సినిమా, కభీ ఝుకేగా నహిం అంటూ ‘పుష్ప రాజ్’ యాటిట్యూడ్ ను కనబరిచాడు అల్లు అర్జున్.అటు తర్వాత ‘‘నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయ్యింది.
నేను సౌత్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ నార్త్ నుండి అవార్డులు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా స్పెషల్’’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘పుష్ప ది రైజ్’ కోవిడ్ టైంలో మొదలై, రిలీజ్ అయినందుకు గాను తనకు దక్కిన అవార్డుని ‘డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు వాలంటీర్లు వంటి ‘COVID వారియర్స్’ కి అంకితం ఇస్తున్నట్లు” అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!