ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ అరుదైన రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫేస్‌బుక్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. బ‌న్నీ ఫేస్‌బుక్ పేజ్‌లో కోటి లైక్‌ల మార్క్‌ను చేరుకుని దూసుకుపోతున్నాడు. బ‌న్నీకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన మ్యానరిజమ్, యాక్టింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక సౌతిండియాలోని అన్ని రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ స్టార్, తాజాగా సోషల్ మీడియాలో ఏ సౌతిండియన్ హీరోకూ సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ అఫీషియల్ ఎకౌంట్‌కు కోటి లైకులు వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే బన్నీ ఫేస్‌బుక్ అకౌంట్ 10 మిలియన్ మార్క్‌ను చేరుకుంది.
సౌతిండియన్ సినిమాకు సంబంధించి ఏ స్టార్‌ హీరోకు ఫేస్‌బుక్‌లో ఈ స్థాయిలో ఫాలోయింగ్ లేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. తన సినిమా విశేషాలనే కాక, పండగ సంబరాలు, ఇంట్లో జరిగే వేడుకలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ బన్నీ, ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఫోటోలకు బన్నీ ఫేస్‌బుక్‌లో ఓ రేంజ్ క్రేజ్ ఉండడాన్ని ప్రత్యేకంగా చూడొచ్చు. ఇక ఇటు వరుసగా సినిమాలతోనే కాక, సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సృష్టిస్తూ అల్లు అర్జున్ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus