Allu Arju, Ram: మరో తమిళ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్..!

వరుస హిట్లతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ మంచి ఫామ్లో ఉన్నాడు.ప్రవీణ్ సత్తార్ వంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా మొదలు పెట్టి.. తర్వాత దాన్ని మధ్యలోనే ఆపేసి… అదే టైములో వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ తో సినిమా సెట్ చేసుకుని.. రామ్ తప్పు చేసాడనే కామెంట్స్ వినిపించాయి. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆ కామెంట్స్ తప్పని ప్రూవ్ చేసాడు. ఆ తర్వాత రామ్ చేసిన ‘రెడ్’ మూవీ కూడా బాగానే ఆడింది. అలా అని ‘ఇస్మార్ట్ శంకర్’ అంత హిట్టు కాదులెండి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రామ్ తో సినిమాలు చేయడానికి తమిళ్ దర్శకులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రామ్ కూడా వాళ్ళకే ఎక్కువ ఓటేస్తున్నట్టు తెలుస్తుంది.ఆల్రెడీ లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్. ఇప్పుడు మరో కోలీవుడ్ డైరెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు మురుగదాస్. ఇటీవల రామ్ ను కలిసి మురుగదాస్ ఓ కథ వినిపించాడట. దానికి రామ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.

నిజానికి ఇదే కథని మురుగదాస్ మొదట.. అల్లు అర్జున్ కు వినిపించాడని ఇండస్ట్రీ టాక్.అది బన్నీకి నచ్చిందని కూడా సమాచారం. అయితే బన్నీతో సినిమా అంటే త్వరగా తేలే వ్యవహారం కాదు. పైగా అతను ‘పుష్ప’ ‘ఐకాన్’ ‘పుష్ప’ వంటి చిత్రాలను ఫినిష్ చేయాలి. అవి పూర్తయ్యే సరికి 2023 వచ్చేస్తుంది. అప్పటివరకు ఖాళీగా ఉండటం ఇష్టం లేక మురుగదాస్ రామ్ ను వెతుక్కుంటూ వెళ్లినట్టు స్పష్టమవుతుంది. మరి రామ్ ఇతన్ని ఎన్నాళ్ళు వెయిటింగ్ లో పెడతాడో చూడాలి.!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus