హాయ్ నాన్న సినిమా ఇటీవల అంటే డిసెంబర్ 7 న రిలీజ్ అయ్యింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. మొదటి రోజు మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. కానీ రెండో రోజు నుండీ బాగానే నిలబడింది. రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందులోనూ ఆడపిల్లలను కన్న తండ్రులు బాగా కనెక్ట్ అవుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా గురించి స్పందించారు. అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ” హాయ్ నాన్న సినిమా చూశాను చాలా బాగుంది. టీం అందరికీ నా అభినందనలు. నా హృదయాన్ని హత్తుకుంది.
నాని గారు ఈ సినిమా చూశాక మీపై గౌరవం మరింతగా పెరిగింది. ఇలాంటి గొప్ప కథలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత మీ సొంతం. మృనాల్ స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంది. బేబి కియారా.. నీ నటనతో మమ్మల్ని కట్టి పడేశావ్. ఇక చాలు స్కూల్ కి వెళ్లు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైరక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. మరోసారి అందరికీ నా ప్రత్యేక అభినందనలు ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం (Allu Arjun) అల్లు అర్జున్ ట్వీట్ వైరల్ అవుతుంది.a