నాని డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా..? సుకుమార్ కి నిరాశేనా..?

బన్నీ… సుకుమార్ కు హ్యాండిచ్చేస్తాడా..?గతేడాది వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తరువాత బన్నీ నుండీ మరో చిత్రం రాలేదు. త్రివిక్రమ్ తో బన్నీ సినిమా అనౌన్స్ చేసి దాదాపు నాలుగు నెలలు పూర్తవుతున్నా ఇంకా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇది బన్నీ కి 19 వ చిత్రం. ఇక తన 20 వ సినిమా సుకుమార్ తోనే అంటూ మరో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు బన్నీ టీమ్. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో చిత్రాన్ని కూడా బన్నీ లైన్లో పెట్టేసాడట.

ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మరో డైరెక్టర్ కథను కూడా అంగీకరించేసాడట. గతంలో దిల్ రాజు తో ‘ఆర్య’ ‘పరుగు’ ‘డీజే’ వంటి చిత్రాలు చేసాడు బన్నీ. వీటిలో ‘ఆర్య’ బ్లాక్ బస్టర్ కాగా.. ‘పరుగు’ చిత్రం హిట్ గానూ ‘డిజె’ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో మరో చిత్రం చేయబోతున్నాడట. నాని తో ‘ఎం.సి. ఏ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న వేణుశ్రీరాం వినిపించిన కథకు బన్నీ ఓకే చెప్పేశాడట. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రం చేయడానికి బన్నీ రెడీ అయిపోతున్నాడట. ఇలా చూస్తే బన్నీ సుకుమార్ కు హ్యాండిచ్చేస్తున్నాడా…అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus