Allu Arjun: బన్నీ ప్లాన్స్ వేరే లెవెల్.. భలే డైరెక్టర్ తో ప్లాన్ చేశాడుగా?

స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప2 తర్వాత ఏ సినిమాలో నటిస్తాడనే ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం దొరకలేదనే సంగతి తెలిసిందే. బన్నీతో సినిమా తీసే దర్శకుల జాబితాలో సంజయ్ లీలా భన్సాలీ పేరు కూడా చేరింది. గతంలో ఎన్టీఆర్ భన్సాలీ కాంబినేషన్ గురించి ఎక్కువగా వినిపించగా ఇప్పుడు మాత్రం బన్నీ భన్సాలీ కాంబినేషన్ గురించి వార్తలు ప్రచారంలోకి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ టీమ్ సంజయ్ లీలా భన్సాలీతో చర్చలు జరిపిందని ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.

బన్నీ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ భలే డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేశాడని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీతో సినిమాలు తీయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. బన్నీ తన స్థాయిని మరింత పెంచుకోవాలని పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదగాలని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.

బన్నీ (Allu Arjun) ఒకవైపు టాలీవుడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూనే మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బన్నీ బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మాత్రం ఆయన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతుంది. పుష్ప2 సినిమాతో 1000 కోట్ల రూపాయల జాబితాలో చేరతానని బన్నీ భావిస్తున్నారు.

బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ లు కూడా భారీ రేంజ్ లో ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus