Allu Arjun: రెండు గంటలు లేటుగా వస్తావా…మీడియాకి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ ఏడాది రెండే రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి వకీల్ సాబ్ మరొకటి అఖండ. ఆ రెండు సక్సెస్ అయ్యాయి కానీ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేకపోయాయి. టికెట్ రేట్ల ఇష్యులే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి నిన్న ఆంధ్రాలో టికెట్ రేట్ల ఇష్యు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ‘పుష్ప’కి సాలిడ్ ఓపెనింగ్స్ రప్పించాలని అల్లు అర్జున్ తెగ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.

ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. గత 4, 5 రోజులుగా నిద్రాహారాలు మానేసి దేశమంతా చుట్టేస్తున్నాడు. బన్నీ ఏ టైంకి ఎక్కడ ఉంటున్నాడో కూడా చెప్పడం కష్టంగా ఉంటుంది.ఈ క్రమంలో కన్నడలో అనగా బెంగుళూర్ లో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది ‘పుష్ప’ యూనిట్. అక్కడి జర్నలిస్ట్ లు కూడా పెద్ద సంఖ్యలో ఆ మీడియా సమావేశానికి హాజరయ్యారు. అయితే 11 గంటల 30 నిమిషాలకి ప్రెస్ మీట్ అయితే బన్నీ 1:30 గంటలకి అక్కడికి చేరుకున్నాడట.

దీంతో ఓ కన్నడ రిపోర్టర్ అల్లు అర్జున్ పై మండిపడ్డాడు. ’11:30 కి ప్రెస్ మీట్ అయితే మీరు 1:30 కి హాజరయ్యారు. 2 గంటలు లేట్ గా వచ్చారు. 2 గంటల నుండీ జర్నలిస్ట్ లని కెమెరా మెన్ లని వెయిట్ చేయించడం మీకు ఏమైనా బాగుందా? మమ్మల్ని ఇంత సేపు వెయిట్ చేయించడం పట్ల మీ ప్రధాన ఉద్దేశం ఏంటి?’ అంటూ ప్రశ్నించాడు. ఆ జర్నలిస్ట్ చెప్పిన మాటలు అర్ధం కాని బన్నీ పక్కనే ఉన్న అసిస్టెంట్ ను పిలిచి అడిగాడు.

పక్కనే ఉన్న రష్మిక కూడా బన్నీకి అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసింది. మొత్తానికి విషయం తెలుసుకున్న బన్నీ.. “ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యాం ఎక్స్ట్రీమ్లీ సారీ.నేను ప్రైవేట్ ఫ్లైట్ లో వచ్చాను. పొగమంచు ఉండడం వల్ల మా ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి టైం పట్టింది.నాకు టైం గురించి తెలీదు. ఐ యామ్ రియల్లీ సారీ. ‘సారీ చెప్పడంలో మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు’ అంటూ ఆ రిపోర్టర్ కు ఝలక్ ఇచ్చాడు బన్నీ.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus