సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య ప్రముఖ హాస్యనటుడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాత. తాను హీరో. ఇలా మూడు తరాల వారు సినిమా రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. అయితే బన్నీ మాత్రం తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినీ రంగానికి చెందినదై ఉండకూడదని అనుకున్నట్లు వెల్లడించారు. ఎందుకు అలా అన్నారో వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా చేస్తున్నారు. నిన్న తన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. “నేను మొదటి నుంచి సినిమా రంగానికి చెందిన అమ్మాయిని చేసుకోకూడదు అని అనుకునేవాడిని. ప్రత్యేక కారణాలు ఏమీ లేవు కానీ.. ఎందుకో మొదటి నుంచి నాకు అలా అనిపించేది. నేను సినిమా వాడినే. మళ్లీ సినిమా అమ్మాయే అయితే.. ఇక మాకు అదే ప్రపంచం అవుతుంది. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలంటే.. మరో రంగానికి చెందిన వారయితే బెటర్ అనేది నా అభిప్రాయం. నా భార్య స్నేహకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. భిన్న ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి అంటారు కదా. అలానే మా బంధం కూడా ధృడమైంది.’’అంటూ అల్లు అర్జున్ తన భార్య గురించి వివరించారు. ఇంకా తమది లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు చేసిన పెళ్లేనని స్పష్టం చేశారు.

“మాది లవ్ మ్యారేజ్ అని అంతా అనుకుంటున్నారు.. నిజంగా మాది లవ్ మ్యారేజ్ కాదు. పెద్దలు చేసిన పెళ్లే. స్నేహ నాకు మంచి ఫ్రెండ్. మా ఇద్దరి అభిరుచులు దగ్గరదగ్గరగా ఉంటాయి. దీంతో మా ఫ్రెండ్స్ మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేవారు. ఎప్పుడూ ఫ్రెండ్స్ అదే మాట చెబుతుండటంతో.. నేను కూడా ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ విషయం ఇంట్లో వాళ్లకి కూడా తెలిసింది. వెంటనే ఈ సంబంధం మాట్లాడేశారు” అంటూ ఆనాటి సంగతిని బయటపెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus