ప్రస్తుతం అల్లు అర్జున్… త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఏంటనేది ప్రకటించలేదు కానీ.. 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం చేస్తూనే బన్నీ మరో రెండు చిత్రాలని కూడా అనౌన్స్ చేశాడు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన సుకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం.. అలాగే నానితో ‘ఎం.సి.ఏ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన వేణుశ్రీరాం తో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు. వాళ్ళు స్క్రిప్టులు కూడా రెడీ చేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికీ ట్విస్ట్ హ్యాండిచ్చి ఇప్పుడు ఓ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట.
తాజా సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీను తో సినిమా చేయడానికి బన్నీ రెడీ అయిపోయాడట. అల్లు అరవింద్ నిర్మించబోతున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుందట. మొన్నే రాంచరణ్ కు ‘వినయ విధేయ రామా’ వంటి డిజాస్టర్ ఇచ్చాడు బోయపాటి. హిట్లిచ్చిన డైరెక్టర్లను వదిలేసి డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా చేయడమేంటనేది ఇక్కడ అందరికి అర్ధం కానీ విషయం. అయితే గతంలో బోయపాటి – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ కారణంతోటే బన్నీ… బోయపాటిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రంతో అయినా బోయపాటి హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడెమో చూడాలి.