Pushpa 2: పుష్ప 2: డైరెక్ట్ గా జనంలోకి బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 6న థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. గతంలో వచ్చిన ‘పుష్ప’ హిందీ వెర్షన్ కి విపరీతమైన ఆదరణ లభించడం వల్ల, ఈ సీక్వెల్ పై నార్త్ ఇండియాలో భారీ హైప్ ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈసారి సినిమాని మరింత గ్రాండ్ గా తీసుకురావాలని ప్రత్యేకంగా ప్రణాళికలు వేస్తున్నారు.

Pushpa 2

‘పుష్ప 2’ విడుదలకు రెండునెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ కోసం ప్లానింగ్ జరుగుతుండగా, దీపావళికి ఈ సినిమా నుండి కొత్త అప్డేట్ రాబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబైలో ట్రైలర్ విడుదలతోనే ప్రచార కార్యక్రమాలకు ఊపిరి పోయనున్నారు. పుష్ప తొలి భాగం నార్త్ ఇండియాలో సంచలన విజయం సాధించినందున, ఈ సారి అక్కడి ప్రేక్షకులతో మరింత దగ్గర కావడానికి అల్లు అర్జున్ ప్రత్యేకంగా పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి బన్నీ పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పర్యటించాలనే ఆలోచనలో ఉన్నారు. నేరుగా అక్కడి ఆడియన్స్ కి చేరువవ్వడం ద్వారా సినిమా హైప్ ను మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. దీపావళి తర్వాత ఈ ప్రచార కార్యక్రమాలపై స్పష్టమైన సమాచారం రానుంది.

అన్ని భాషల్లో భారీగా విడుదలవుతున్న ‘పుష్ప 2’ అల్లు అర్జున్ కెరీర్ కి కూడా కీలక చిత్రంగా నిలవనుంది. ఈ సినిమా సక్సెస్ తో బన్నీ పాన్ ఇండియా రేంజ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా 1000 కోట్ల మార్క్ ను అందుకోవాలని చూస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

అఖండ 2 హిందీ మార్కెట్ కోసం బడా స్టార్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus