Boyapati Srinu: అఖండ 2 హిందీ మార్కెట్ కోసం బడా స్టార్?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హిట్ సిరీస్‌లో మరో కీలక చిత్రం రాబోతోంది. ‘అఖండ’ (Akhanda) విజయంతో బాలయ్య – బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ తో ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో ‘అఖండ 2’ని తెరకెక్కించేందుకు సిద్ధమైంది. ‘అఖండ 2: తాండవం’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది.

Boyapati Srinu

ఈసారి బోయపాటి శ్రీను బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీగా ఖర్చు చేస్తున్నారట. మరింత హైప్ తో పాన్ ఇండియా మార్కెట్‌కి తగ్గట్టుగా సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి ఓ బడా స్టార్‌ను తీసుకోవాలని బోయపాటి అనుకుంటున్నారు. లేటెస్ట్ టాక్ ప్రకారం, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను ఈ రోల్ కోసం సంప్రదిస్తున్నారని తెలిసింది. సంజయ్ దత్ (Sanjay Dutt) అంగీకరిస్తే, ‘అఖండ 2’కి భారీ హైప్ వచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మరొక హిందీ స్టార్ హీరోతో చర్చలు జరిపే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ లో కూడా సినిమాను భారీగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ మార్కెట్ పై మరింత పట్టు సాధించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ‘అఖండ 2’లో బాలకృష్ణతో పాటు ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

సంగీతం థమన్ (S.S.Thaman) అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటుల వివరాలను కూడా తెలియ జేయాలని అనుకుంటున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

అఖిల్ న్యూ ప్రాజెక్ట్.. RGV కథతో లింకా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus