‘పుష్ప’ కోసం బన్నీ సరికొత్త ప్రయోగం..!

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాకపోయినా.. ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించి అల్లు అర్జున్ స్టామినా ఏంటన్నది అందరికీ చాటి చెప్పింది. దాంతో ఇప్పుడు ‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళం భాషల్లో విడుదల చెయ్యాలి అని రెడీ అవుతున్నారు ‘పుష్ప’ నిర్మాతలు.

సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన హీరోయిన్ కావడం విశేషం.ఇక పాన్ ఇండియా చిత్రం కావడంతో.. మిగిలిన భాషల్లో క్రేజ్ ఉన్న నటీ నటులను కూడా ఈ చిత్రంలో ఎంపిక చేసుకుంటున్నారు. బాలీవుడ్ విలన్ సునీల్ శెట్టి ని ఆల్రెడీ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అంతే కాదు.. ఊర్వశి రౌతేలా తో కూడా ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ‘భైరవగీత’ హీరో ధనుంజయ్ ను కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట.కన్నడంలో అతను క్రేజ్ ఉన్న నటుడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కోసం బన్నీ ఓ ప్రయోగం కూడా చేస్తున్నాడట. అదేంటంటే… తెలుగుతో పాటు హిందీ,తమిళ్, మలయాళంలో అతనే స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతున్నాడట. ఇందుకు శిక్షణ కూడా తీసుకుంటున్నాడు అని సమాచారం.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus