‘మాస్’ లేకపోతే…మూసుకోండి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘సరైనోడు’. ఈ మధ్యనే విడుదలయిన ఈ సినిమా టీజర్ ఆన్‌లైన్ లోనే కాదు సినిమా థియేటర్స్ లో కూడా హై వోల్టేజ్ తో ప్రకంపనలు సృష్టిస్తుంది. ‘ఎర్ర తోలు కదా స్టైల్ గా ఉంటాడనుకొన్నావేమో మాస్… వూరమాస్’ అంటూ మన బన్నీ చెప్పిన డైలాగ్స్ కు ఫాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఇప్పుడు ఈ యువ హీరో కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడని సమాచారం….ఇంతకీ విషయం ఏమిటంటే…గతంలో ఏ దర్శకుడు కధ చెప్పినా క్యారెక్టర్ కొత్తగా, స్టైలిష్ గా ఉండాలి అని అడిగే బన్నీ ఇప్పుడు తాజాగా మనసు మార్చుకుని, కథ ఏం చెప్పినా ఎలా చెప్పినా కూడా అందులో మాస్ ఎలిమెంట్స్ లేకపోతే సినిమాను చేయనంటున్నాడట.

ఎందుకంటే ఆ మధ్య కొన్నాళ్ళు..కొన్ని ప్రయోగాలు.. క్లాస్ పాత్రలు.. చాలా చేసి చేతులు కాల్చుకున్నాడు. అందుకే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దర్శకులకు చెప్పడంటా, ఏ కధతో అయిన రండి కాకపోతే మాస్ ఎలిమెంట్స్ ఉంటేనే రండి అని. ఇక బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ సత్య మూర్తి’ సైతం పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అలాంటి కధలను చేసేందుకు కాదు కదా, వినేందుకు కూడా ఇష్టపడటంలేదు అని బన్నీ చెబుతున్నాడు. మరి మాస్ సినిమాలు హిట్ అయితే ఎంత మంచి పేరు వస్తుందో, పోతే కూడా అంతే బ్యాడ్ నేమ్ మూటగట్టుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus