సోషల్ మీడియాలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మీద రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ తో చేయాల్సిన మైథాలజీకల్ సినిమాను మళ్లీ బన్నీ వైపు తెచ్చినట్లు టాక్ వచ్చింది. ఇక నిజమేనా కాదా, ఎప్పుడు మొదలవుతుంది అనే సందిగ్ధంలో ఉన్న ఫ్యాన్స్ కు నిర్మాత బన్నీ వాస్ తనదైన శైలిలో సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. నేరుగా చెప్పకపోయినా, ఆయన ఇన్ డైరెక్ట్ గా ఇచ్చిన హింట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ముఖ్యంగా త్రివిక్రమ్ గతంలో బన్నీకి చెప్పిన కథ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిందనే ప్రచారంపై వాస్ స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఆ విషయం అడగగానే ఆయన నవ్వుతూ సమాధానం దాటవేసినా, ఆ వార్త అబద్ధం అని మాత్రం ఖండించలేదు. ఇష్యూ ప్రస్తుతం సెన్సిటివ్ గా ఉందని అంటూనే, అసలు విషయాన్ని జనవరిలో అధికారికంగా ప్రకటిస్తామని బాంబ్ పేల్చారు. దీన్నిబట్టి తెరవెనుక వ్యవహారం మొత్తం పాజిటివ్ గానే ఒక కొలిక్కి వచ్చినట్లే అనిపిస్తోంది.
బన్నీ లైనప్ లో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయని, వాటి వివరాలు జనవరిలో బయటకు వస్తాయని వాస్ స్పష్టం చేశారు. ఇక షూటింగ్స్ గురించి ఆయన చెప్పిన టైమ్ లైన్స్ ఫ్యాన్స్ కాలిక్యులేషన్స్ కు పక్కాగా సరిపోతున్నాయి. ఒక సినిమా 2026 జూలై లేదా ఆగస్టులో మొదలవుతుందని, మరొకటి 2027 మార్చిలో సెట్స్ పైకి వెళ్తుందని బన్నీ వాస్ క్లియర్ కట్ గా చెప్పారు. ఉదయం నుంచి త్రివిక్రమ్ సినిమా 2027 మార్చిలో స్టార్ట్ అవుతుందని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న టాక్ కి, ఇప్పుడు వాస్ చెప్పిన డేట్ కి కరెక్ట్ గా సింక్ అవుతోంది.
అంటే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో తర్వాత ఈ బ్లాక్ బస్టర్ మ్యాజిక్ రిపీట్ అవ్వడం దాదాపు ఖాయం అన్నమాట. ప్రస్తుతం అట్లీతో బిజీగా ఉన్నా, ఫ్యూచర్ లైనప్ ను బన్నీ ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నారో ఈ అప్డేట్ తో అర్థమవుతోంది. జనవరి వరకు వెయిట్ చేస్తే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చూడొచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.