మళ్ళీ ‘అలకనంద’ జోలికి ఎందుకు బన్నీ..?

అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది ఈ చిత్రం. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తండ్రీకొడుకుల మద్యే సాగే కథ ఇదంట. అందుకే ఈ చిత్రానికి ‘ నాన్న- నేను’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.అయితే ఈ చిత్ర కథ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర కథకు కొంచెం దగ్గర పోలికలు ఉండడంతో కొన్ని మార్పులు చేశారట. అందుకే ఇంత లేటుగా ఈ చిత్రాన్ని ప్రారంభించినట్టు తెలుస్తుంది.

అంతేకాదు తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్ర కథను మార్చరట. తల్లి పాత్ర కోసం సీనియర్ నటి ‘టబు’ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. తల్లి పాత్ర వైపు నుండీ టైటిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ‘అలకనంద’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసారని సమాచారం. త్రివిక్రమ్ చిత్రాలు దాదాపు ‘అ’ తోనే మొదలవుతాయి. ‘అతడు’ ‘అత్తారింటికి దారేది’ ‘అఆ’ ‘అజ్ఞాతవాసి’ ‘అరవింద సమేత’ ఇవన్నీ ‘అ’ మొదలయ్యాయి. ఇప్పుడు ఇదే కోవలోకి ‘అలకనంద’ కూడా చేరబోతోంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే అల్లు అర్జున్ ప్లాప్ సినిమా అయిన ‘బద్రినాథ్’ చిత్రంలో తమన్నా క్యారెక్టర్ పేరు కూడా ‘అలకనంద’ కావడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus