Allu Arjun: బన్నీకి కూడా తారక్‌లా వాచ్ ఫాంటసీ ఉందా? ఆ వాచీ ధర అంతనా?

మనలో చాలామందికి కొత్త వాచీ కనిపిస్తే చాలు వాటి వివరాలు తెలుసుకోవడం విషయంలో ఆసక్తి ఉంటుంది. అదే బాగా డబ్బున్నవాళ్లు, సెలబ్రిటీలు అయితే వాటిని కొనేయడంలో ఆసక్తి చూపిస్తారు. టాలీవుడ్‌లో ఇలా కొత్త వాచీలు, ఖరీదైన వాచీలు కొనేవారిలో తారక్‌ (Jr NTR) ముందుంటాడు అంటారు. ఆయన ధరించే వాచీలు చాలా కాస్ట్‌లీ. అందుకే ఆయన ఏ ఈవెంట్‌కి వచ్చినా చేతికున్న వాచీ ఆసక్తికరంగా మారిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన ‘బావ’ అల్లు అర్జున్‌ (Allu Arjun) విషయంలో ఇదే జరిగింది.

అల్లు అర్జున్ ఇటీవల డైరక్టర్స్‌ డేకి హాజరైనప్పుడు ధరించిన పనేరై వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. సెలబ్రేటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ.. ఇప్పుడు అదే పని చేసింది. ఆ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం బన్నీ ధరించిన వాచ్ ధర సుమారు నాలుగు లక్షల రూపాయలు. క్లియర్‌గా చెప్పాలంటే రూ.3,97,431 అని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

గతంలో తారక్‌ కూడా ఇలా కాస్ట్‌లీ వాచీలు ధరించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. బావబామ్మర్దులు ఒక్కటే అంటూ నెటిజన్లు బన్నీ – తారక్‌ అభిమానులు మురిసిపోతున్నారు. మరికొందరేమో ఒకరి వారీ ఒకరు షేర్‌ చేసుకుని ఫొటోల్లో కనిపిస్తే బాగుండు. ఆ బ్రొమాన్స్‌ చూడాలి అని అనుకుంటున్నారు. మరి నెటిజన్లు కోరికను మన్నించి తారక్‌ – అల్లు అర్జున్‌ ఏమన్నా ఇలా చేస్తారేమో చూడాలి.

ఇక బన్నీ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్‌’ ( ) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. మరోవైపు తారక్‌ ‘దేవర 1’ (Devara)  , ‘వార్‌ 2’ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తతుం ‘వార్‌ 2’ షూట్‌ జరుగుతుండగా.. ‘దేవర 1’ సినిమా అక్టోబరులో విడుదల కావాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాల బ్యాలెన్స్‌ బన్నీ ఎలా చేస్తాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus