Allu Sneha Reddy: ఆ విషయంలో మాత్రం బన్నీ భార్య స్నేహారెడ్డికి ఎవరూ సాటిరారుగా!

Advertisement

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ రంగానికి దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డి గురించి తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. పిల్లల పెంపకం విషయంలో స్నేహారెడ్డి తీసుకున్న నిర్ణయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. స్నేహారెడ్డి ఇచ్చిన పేరెంటింగ్ టిప్స్ ను నెటిజన్లు సైతం తెగ మెచ్చుకుంటున్నారు. పిల్లలను కొత్తగా ఆలోచించేలా ప్రోత్సహించాలని వారం అంతా పిల్లలు చేయాల్సిన పనులకు ప్రణాళిక వేసుకోవాలని స్నేహారెడ్డి చెప్పుకొచ్చారు.

పిల్లలు ప్రకృతిలో గడిపేలా కాసేపు ఎండలో ఉంచాలని స్క్రీన్ టైమ్ తగ్గించడం కొరకు పిల్లల్లో ఊహాశక్తి పెంపొందించే పనులను ప్రోత్సహించాలని స్నేహారెడ్డి చెప్పుకొచ్చారు. పిల్లల్లో జాలి, కరుణ వంటి గుణాలను పెంపొందించాలని ఆమె కామెంట్లు చేశారు. తల్లులు తమకోసం కొంత సమయం కేటాయించుకోవాలని ఇది అన్నిటికంటే ఎంతో ముఖ్యమైనదని ఆమె అన్నారు. స్నేహారెడ్డి వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

బన్నీ, స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ జోడీ క్యూట్ కపుల్, సూపర్ కపుల్ అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బన్నీ కెరీర్ విషయానికి వస్తే పుష్ప ది రూల్ సినిమాతో ఈ స్టార్ హీరో బిజీగా ఉన్నారు. ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని మైత్రీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

పుష్ప ది రూల్ మూవీ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సుకుమార్ ఈ సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్నేహారెడ్డి ఒక యాడ్ లో తాజాగా నటించారనే సంగతి తెలిసిందే. స్నేహారెడ్డి (Allu Sneha Reddy) కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆమె కెరీర్ పరంగా సంచలనాలను సృష్టిస్తారని చెప్పవచ్చు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus