Allu Arjun: బన్నీ భార్యను ప్రేమగా ఏమని పిలుస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఈ మధ్య కాలంలో అరుదైన రికార్డ్ లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప2 (Pushpa2) సినిమాకు 450 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందనే వార్త ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తోంది. కేవలం థియేట్రికల్ హక్కులతో మాత్రమే ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం అయితే బన్నీ భార్య స్నేహారెడ్డి సైతం సోషల్ మీడియాలో అంతకంతకూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

స్నేహారెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో 9 మిలియన్ ఫాలోవర్లు ఉండగా కొంతమంది టాలీవుడ్ స్టార్స్ కంటే ఈమెకే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్నేహారెడ్డి షేర్ చేసిన ఫోటోలకు లక్షల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. బన్నీ, స్నేహారెడ్డి కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. స్నేహారెడ్డి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా బన్నీ స్నేహారెడ్డిని ప్రేమగా క్యూటీ అని పిలుస్తారట. చాలా సందర్భాల్లో బన్నీ స్నేహారెడ్డి గురించి ప్రస్తావించాల్సి వస్తే క్యూటీ అని సంబోధించేవారు.

పెళ్లి తర్వాత బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. బన్నీ, స్నేహారెడ్డిలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ ఇతర భాషల ప్రేక్షకులకు సైతం తన సినిమాల ద్వారా దగ్గరయ్యారు. రాబోయే రోజుల్లో పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటేలా బన్నీ ప్లానింగ్స్ ఉన్నాయి.

వరుస సినిమాలలో నటిస్తున్న బన్నీ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది. టాప్ డైరెక్టర్లు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తుండటం బన్నీకి కెరీర్ పరంగా కలిసొస్తుండటం గమనార్హం. బన్నీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus