అల్లు స్నేహ రెడ్డి ధరించిన డ్రెస్‌ల ధర తెలిస్తే షాకే!

  • December 11, 2020 / 10:16 AM IST

నిహారిక పెళ్లిలో హైలైట్స్‌ ఏంటి అంటే… చెప్పడానికి చాలానే ఉంటాయి. కొణిదెల కుటుంబాల గ్రూప్‌ ఫొటోలు, అందులో అల్లు కుటుంబాల స్పెషల్‌ అప్పీయరెన్స్‌, సంగీత్‌లో స్టెప్పుల కోలాహలం, పవన్‌ – అకీరా ఫొటోలు… ఇలా చాలానే ఉన్నాయి. ఎలాగూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దుస్తులు, వాటి ధరల లెక్కలు ఉంటాయి. అయితే వాటితోపాటు మరో విషయమూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అదే అల్లు అర్జున్‌ భార్య స్నేహ రెడ్డి డ్రెస్‌లు. అవును నిజం.. ఆమె ధరించిన దుస్తుల ధరలు వింటే మీరూ షాక్‌ అవుతారు.

మామూలుగానే ‘టాప్‌ లేచిపోయే’ ట్రెండీ దుస్తులు ధరించే స్నేహా రెడ్డి నిహారిక పెళ్లికి అంతకుమించి ఫ్యాషన్‌ను చూపించింది. ఎంతగా అంటే ఏకంగా అల్లు అర్జునే ‘హాటీ’ అంటూ తన భార్య ఫొటో స్టేటస్‌లో పెట్టి మురిసిపోయేంత. ఆమెకు పోటీగా అల్లు అర్జున్‌ కూడా సరికొత్తగా తయారయ్యాడు. వాళ్లు షేర్‌ చేసిన ఫొటోలు చూస్తేనే ఈ విషయం తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో చాలామంది బన్నీ – స్నేహల దుస్తుల డిజైనర్‌ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారు. దానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం మేమూ చేశాం. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే?

హర్మన్‌ కౌర్‌ అనే స్టైలిస్ట్‌ బన్ని – స్నేహ దుస్తులు డిజైన్‌ చేశారట. నిహారిక పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంతవరకు స్నేహ ధరించి దుస్తుల ధరలు ఇప్పుడు బయటికొచ్చాయి. పెళ్లికి వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లినప్పుడు స్నేహ ధరించిన స్పెషల్‌ లాంగ్‌ స్కర్ట్‌ ధర సుమారు ₹15 వేలట. దీనిని అనితా డోంగ్రే డిజైన్‌ చేశారు. మెహందీలో ఆమె ధరించిన బ్లాక్‌ అండ్‌ రెడ్‌ కాంబినేషన్‌ డ్రెస్‌ ధర ₹50 వేలు. దీనిని సందీప్‌ ఖోస్లా సిద్ధం చేశారు. ఇక సంగీత్‌లో స్నేహ అమిత్‌ అగర్వాల్‌ డిజైన్‌ చేసిన స్పెషల్‌ డ్రెస్‌లో కనిపించారు. దాని ధర ఏకంగా ₹4,30,000 అని టాక్‌. పెళ్లిలోలో అయితే స్నేహ ₹1,25,000 విలువ చేసే చీరలో మెరిసిపోయింది. రా మ్యాంగో రంగులో రూపొందించిన ఆ చీరను చూసి వావ్‌ అనక మానరు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus