స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇతర భాషల్లోనూ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. వారి కోసం డైరక్ట్ మూవీ చేయాలనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. గత ఏడాది తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెలుగు,తమిళ బాషల్లో ఓక చిత్రాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. లింగు సామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని కూడా చెప్పుకున్నారు. ఎందుకో ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య అపజయం పాలవడంతో కాస్త ఆలోచనలో పడ్డారు. మంచి కథ కోసం వెతికారు
విక్రమ్ కుమార్ చెప్పిన కథని ఓకే చేసినట్లు సమాచారం. అందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ గ్యాప్ లో తమిళంలో అడుగుపెట్టడానికి కూడా మరో కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. “వీరం, వేదాళం” చిత్రాల దర్శకుడు శివ చెప్పిన మాస్ స్టోరీ బన్నీకి బాగా నచ్చిందంట. అందుకే వెంటనే ఓకే చెప్పినట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ కుమార్ సినిమా తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ల్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.