బ్రహ్మీ మరిన్ని చిత్రాలు చేసి మనల్ని నవ్వించాలి : బన్నీ

హాస్య బ్రహ్మ, టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన బ్రహ్మానందంకి ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో బ్రహ్మానందం హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించగా… వైద్యుల సలహా శస్త్ర చికిత్స చేయించుకోవాలని చెప్పడంతో…. వెంటనే ముంబైకి తరలించారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్‌టిట్యూట్’లో గత నెల జనవరి 14న గుండె ఆపరేషన్‌ చేయించుకున్నారు. వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో… ఇప్పటివరకూ ముంబైలోనే ఉండిపోయారు.

ఇటీవల తిరిగి హైదరాబాద్ కి చేరుకున్నారు బ్రహ్మానందం. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆయన్ని ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. బ్రహ్మీని కలిశారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా వెళ్ళి బ్రహ్మానందం ను పరామర్శించారు. ఎప్పటిలాగే… ఆయన సినిమాలు చేయాలనీ… మరింత కాలం మనల్ని నవ్వించాలని కోరుకున్నారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘హారికా అండ్ హాసినీ’ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుండీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి… సెప్టెంబర్ కి ఫినిష్ చేసి… దసరా కానుకగా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus