అల్లు అర్జున్ 20 వ చిత్రం డైరెక్ట్ చేయనున్న ‘సాహూ’ డైరెక్టర్..?

`నా పేరు సూర్య‌ నా ఇల్లు ఇండియా` చిత్రం డిజాస్టర్ కావడంతో అల్లు అర్జున్ చాలా డీలాపడిపోయాడు. తన నెక్స్ట్ చిత్రం కోసం తొందరపడకుండా చాలా కథలు విని.. చివరికి త్రివిక్రమ్ ను ఫైనలైజ్ చేసాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రం పై మంచి హైప్ ఏర్పడిందనే చెప్పాలి.

ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత అల్లు అర్జున్ `గీత‌గోవిందం` డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం(బుజ్జి) తో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ చిత్రాన్ని పరశురామ్… సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా అల్లుఅర్జున్ ఓ యువ డైరెక్టర్ తో నెక్స్ట్ సినిమా చేయడానికి ఉత్సాహం చుపిస్తున్నాడంట. ఆ యువ దర్శకుడు ఎవరో కాదు, ప్రస్తుతం ప్రభాస్ తో `సాహో` వంటి భారీ చిత్రాన్ని డైరెక్ట‌ చేస్తున్న సుజిత్‌.

ఈ మధ్యే బ‌న్నీని కలిసి సుజిత్ ఓ క‌థ వినిపించాడట, క‌థ న‌చ్చ‌డంతో బ‌న్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ నిర్మించబోతుందట. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus