‘డోస్’ పెంచి తప్పు చేశాడా??

ఒక హీరో, పది మంది విలన్స్ ని చీల్చి చెండాడుతుంటే, హీరో కొట్టే దెబ్బలకు విలన్స్ దుమ్ము లేచిపోతుంటే, థియేటర్ లో కూర్చుని సినిమా చూస్తున్న అభిమానులకు తామే అంతా చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మరి అలాంటి మాస్ పాత్రలు, మైండ్ బ్లోయింగ్ ఫైట్స్, దుమ్ము రేపే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ తెరకెక్కించాలి అంటే మాత్రం అది దర్శకుడు బోయపాటికే సొంతం. ఇదిలా ఉంటే తాజాగా విడుదలయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒకే అనిపించుకుంది. తన మార్క్ స్టైలిష్ యాక్షన్ తో వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్న స్టైలిష్ స్టార్ ను పక్కా మాస్ హీరోగా చేసే ప్రయత్నంలో బోయపాటి కాస్త శృతి తప్పాడు.

కాని సరైనోడుకి బన్నినే సరైనోడు అని పక్కాగా చెప్పేలా కూడా సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో గణ క్యారక్టర్ లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పాలి. ఇక హాల్లో అభిమానుల కొలాహాలానికి హద్దులు లేవు అనే చెప్పాలి. కానీ ఎక్కడో ఏదో తెలియని వెలితి…దానికి అసలు కారణం బన్నీ సినిమా అంటే కామెడీ ని ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చే అభిమానులకు నిరాశే ఎదురయింది. ఒక్క బ్రహ్మీ మినహా పెద్దగా కామెడీ క్యారెక్టర్స్ లేకపోవడం, అంతేకాకుండా హింస ఎక్కువైపోవడంతో ఈ సినిమాను మల్టీప్లెక్స్ అభుమానులు చూసేందుకు ఇష్ట పడటంలేదు. అయితే ఓవర్ ఆల్ గా మాత్రం సినిమా మంచి క్రేజ్ తో దూసుకుపోతూ బన్నీ కరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. చూడాలి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags