ప్రియ ప్రకాష్.. ఈమె గురించి ఇప్పుడు ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. తొలి సినిమా విజయం తర్వాత హీరో, హీరోయిన్లు పాపులర్ కావడం సహజం. ప్రియ మాత్రం రిలీజ్ కాకముందే పాపులర్ అయింది. మలయాళంలో ఒమర్ లులు దర్శకత్వం వహించిన “ఒరు అదర్ లవ్” సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ భామ ఓ సన్నివేశంలో కన్ను కొట్టి దేశ యువకులను ఆకర్షించింది. కేవలం ప్రేక్షకులని మాత్రమే కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా తన కనుసైగతో పడగొట్టింది. ఆ క్లిపింగ్ వైరల్ అయిన నాడే అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికపై స్పందించారు. “ఇప్పటివరకు నేను చూసిన క్యూట్ వీడియోల్లో ఇది ఒకటి.
పవర్ ఆఫ్ సింప్లిసిటీ. లవ్ ఇట్” అని ట్వీట్ చేస్తూ ప్రియ వీడియోను బన్నీ షేర్ చేశారు. దీనిపై తాజాగా ప్రియ స్పందించింది. తన సహ నటుడు రోషన్ అబ్దుల్ రహూఫ్తో కలిసి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడింది. “అభిమానుల నుంచి నాకు ఇంత ఆదరణ లభించినా..అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం మర్చిపోలేను. కేరళలో అర్జున్‌కి అభిమానులు ఎక్కువ” అని తెలిపింది. ఈ మూవీ టీజర్ సైతం విశేషంగా ఆకట్టుకుంది. నటీనటులతో షాన్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పూర్తి పాటలు త్వరలో రిలీజ్ కానున్నాయి. అలాగే సినిమాని మళయాళంతో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.