కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచాలని అనుకుంటూ ఉంటాం. మన సెలబ్రిటీలు కూడా ఇలా చేస్తుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలాంటి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తన సినిమాలకు సంబంధించి ఐకానిక్ డ్రెస్సులు, వస్తువులను భద్రపరచాలి నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా నుండి ఈ నిర్ణయాన్ని సీరియస్ గా అమలు చేస్తున్నానని చెప్పాడు బన్నీ. ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆఫీస్ లో మీటింఫ్ సన్నివేశం కోసం వేసుకున్న ఎరుపు రంగు కోటును,
బుట్టబొమ్మ పాటలో వేసుకున్న పూల చొక్కాను భద్రంగా దాచుకున్నట్లు తెలిపాడు ఈ హీరో. ప్రతీ సినిమాకి సంబంధించిన కొన్ని బట్టలు, వస్తువులు ఇలా దాచిపెట్టడం వలన కొన్నేళ్ల తరువాత వాటి విలువ మరింత పెరుగుతుందని అంటున్నాడు బన్నీ. అంతేకాకుండా.. అవి మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెబుతున్నాడు. నిజానికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా కంటే ముందు నుండే బన్నీకి ఈ అలవాటు ఉంది. ‘ఆర్య2’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ సినిమాలకు చెందిన కొన్ని వస్తువులను బన్నీ దాచుకున్నాడు. వాటిలో కొన్ని గతంలో సమంత నిర్వహిస్తోన్న ఛారిటీ కోసం ఇచ్చేశాడు.
ఇక నుండి మాత్రం ఇలా వస్తువులు సేకరించడం సీరియస్ గా అమలు చేస్తానని.. ప్రతీ సినిమాకి సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని దాచుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!