అల్లు అర్జున్ కూడా అదే ముహూర్తానికి మొదలెడతాడా..??
- April 28, 2016 / 07:40 AM ISTByFilmy Focus
“సరైనోడు” సినిమా సాధిస్తున్న సూపర్ సక్సెస్ ను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో లింగు స్వామి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యేది జూన్ లోనే అయినప్పటికీ.. ఏప్రిల్ 29 దాటితే నవంబర్ వరకూ మరో మంచి ముహూర్తం లేని కారణంగా.. ఏప్రిల్ 29 నాడే తన తాజా చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించే అవకాశం లేకపోలేదని మెగా కాంపౌండ్ సమాచారం.
ఒకవేళ అది నిజంగానే జరిగితే.. చిరంజీవి, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ ల సినిమాలు ఒకేరోజు మొదలైతే.. ఇక మెగా అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలుండవ్!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















