‘బ్యాచిలర్‌’ విషయంలో అల్లు అరవింద్‌ నిర్ణయం తీసేసుకున్నాడా?

కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో ‘ఇక ఓటీటీలోకే…’ ఈ మాట ఎక్కువగా వినిపించిన సినిమాల్లో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ ఒకటి. అఖిల్‌ – పూజా హెగ్డే నటించిన ఈ సినిమా రిలీజ్‌ విషయంలో ఆ టైమ్‌లో చాలా వార్తలొచ్చాయి. సినిమా అవుట్‌పుట్‌ విషయంలో అంతగా కాన్ఫిడెంట్‌గా లేని నిర్మాణ సంస్థ ఓటీటీవైపు చూస్తోందని వార్తలొచ్చాయి. అయితే వీటన్నింటిని కొట్టేస్తూ… దర్శక,నిర్మాతలు రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. దీంతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడింది.

అయితే ఇప్పుడు మళ్లీ అవే పుకార్లు వస్తున్నాయి. ఆ మధ్య తెలుగు సినిమాల తేదీలను గంపగుత్తగా ఒకేసారి ప్రకటించారు. అప్పుడు కూడా ‘బ్యాచిలర్‌’ డేట్‌ చెప్పలేదు. దీంతో సినిమా ఇప్పట్లో లేనట్లే అనుకున్నారు. అయితే ఈ వార్తలన్నీ చదివిందేమో ప్రొడక్షన్‌ టీమ్‌… వెంటనే జూన్‌ 19 అంటూ ప్రకటించారు. ఆ తర్వాత ఓ పాట కూడా రిలీజ్‌ చేశారు. మళ్లీ కామ్‌ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ ఓటీటీ మాట వినిపిస్తోంది. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.

ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్‌ కాబట్టి… ఓటీటీ అంటే ఆహాలో వస్తుందనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు మంచి డీల్‌ నెట్‌ఫ్లిక్స్ నుండి వచ్చిందట. ఈ డీల్‌కి అల్లు అరవింద్‌ కూడా ఓకే చెప్పేయాలని అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అక్కినేని కుటుంబ వారసుడి సినిమాను ఇలా ఓటీటీకి ఇచ్చేయడానికి ఒప్పుకుంటారా అనే మాటలూ వినిపిస్తున్నాయి.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus