70వ పుట్టినరోజు నాడు ఆస్తిని సమానంగా పంచేసిన అల్లు అరవింద్

తెలుగు ఇండస్ట్రీకి అపర చాణుక్యుడు, అపార మేధావి అయిన అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డిజాస్టర్ సినిమాకు కూడా మినిమమ్ లాభాలు తెచ్చిపెట్టేలా చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాంటి అల్లు అరవింద్ తన 70వ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక కీలకమైన నిర్ణయం తీసుకొన్నాడు. తన ఆస్తిని తన కొడుకులు, చెల్లెళ్లకు సమానంగా వ్రాశాడు. కొడుకులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ మరియు చెల్లెలు వసంతకు గీతా ఆర్ట్స్ సంస్థ లాభాలు మరియు ఆస్తిని సమానంగా పంచేశాడు.

నిజానికి తన తదనంతరం అల్లు శిరీష్ ప్రొడక్షన్ చూసుకోవాలనేది అల్లు అరవింద్ కోరిక.. కానీ అల్లు శిరీష్ నటనవైపు మొగ్గుచూపడంతో, మొన్నటివరకూ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ ను చూసుకొంటున్న అల్లు బాబీని నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేశాడు అల్లు అరవింద్. ఇక అల్లు అర్జున్ ఎలాగూ గీతా ఆర్ట్స్ 2 ను బన్నీ వాసు సహాయంతో చక్కగా రన్ చేస్తున్నాడు. ఆ సంస్థ త్వరలోనే డిజిటల్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. అల్లు శిరీష్ ఒక్కడూ హీరోగా కనీస స్థాయి విజయాన్ని రుచి చూస్తే.. అల్లు అరవింద్ కంటే సంతోషమైన తండ్రి మరొకరు ఉండరు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus