Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

గత నెల చివర్లో అంటే ఆగస్టు 30న దివంగత స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య సతీమణి, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాతృమూర్తి, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ , మెగాస్టార్ చిరంజీవికి స్వయాన అత్తగారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమ్మమ్మ అయినటువంటి శ్రీ అల్లు కనకరత్నం గారు కాలం చేశారు. ఆమె వయసు 94 ఏళ్ళు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం వల్ల.. శక్తి కోల్పోవడం, శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఆమె చివరి శ్వాస వదిలారు.

Allu Family

కోకాపేట్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈరోజు ఆమె పెద్ద కర్మను జరిపారు కుటుంబ సభ్యులు. దీనికి మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్..లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యి అల్లు కనకరత్నం గారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి.. లతో సన్నిహితంగా అల్లు అర్జున్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కొన్నాళ్ళ నుండీ అల్లు అర్జున్ మెగా అభిమానులకి దూరమయ్యాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి పెద్ద టార్గెట్ అయ్యాడు. పుష్ప 2 టైంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్, ఎన్నికల టైంలో నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్ధి శిల్పా రవికి ప్రచారం చేయడం వంటివి పవన్ అభిమానులకు, మెగా ఫ్యామిలీకి కోపం తెప్పించాయి. ఈ ఫోటోలు చూశాక వాళ్ళ ఆగ్రహం కూడా తగ్గే అవకాశం ఉంది.

 

సూపర్ హిట్ లిస్ట్..లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus