Allu Sirish: మీమర్స్‌కి కౌంటర్‌ ఇవ్వాలంటే శిరీషే అనేలా రియాక్ట్‌ అయ్యాడుగా…

బయటకు కనిపించడు కానీ అల్లు శిరీష్‌ చాలా సెటైరికల్‌ పర్సన్‌. ఆయనకు సన్నిహితంగా ఉండేవారికి ఈ విషయం బాగా తెలుసు. హీరోగా వరుస సినిమాలు చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూలు చేసిన మీడియా మిత్రులకు కూడా బాగా తెలుసు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో నెటిజన్లకు బాగా తెలిసింది. ఆయన డ్రెస్సింగ్‌ సెన్స్‌ గురించి ఓ మీమర్‌ చేసిన కామెంట్‌కు.. ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దానికి కారణం ఆ రిప్లై బాగా స్ట్రాంగ్‌గా ఉండటమే.

Allu Sirish

అల్లు శిరీష్‌కు ఇటీవల నయనిక అనే అమ్మాయితో నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి అయినపుడు నితిన్ ఇచ్చిన పార్టీలో అతడి భార్య షాలిని ఫ్రెండ్ అయిన నయనికను చూడడం, ఆ తర్వాత పరిచయం పెరిగి, ప్రేమగా మారడం.. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్థం చేసుకోవడం ఇదంతా మొన్నీమధ్యే అందరికీ తెలిసింది. ఆ వేడుకకు శిరీష్ మెడలో నెక్లెస్‌తో రావడం మీమర్స్‌కు ఓ పాయింట్‌ దొరికినట్లు అయింది.

నెక్లెస్‌ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ అలా అలా శిరీష్ దృష్టికి వెళ్లినట్లుంది. ఆ మీమ్స్‌లో ఒకదానిని షేర్ చేస్తూ అతను ఆ మీమర్లకు కౌంటర్ ఇచ్చాడు. శిరీష్‌ షేర్‌ చేసి మీమ్‌లో ‘నెక్లస్‌కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డాణం పెట్టుకుంటే ఏమైపోతారో’ అని రాసి ఉంది. దాన్ని షేర్ చేస్తూ తెలుగు మీమర్స్ భలే ఫన్నీ అని రాసుకొచ్చాడు శిరీష్‌. అక్కడితో ఆగకుండా వడ్డాణం మహిళలు మాత్రమే ధరిస్తారని.. మగవాళ్లు నెక్లస్‌లు ధరించడం కొత్తేమీ కాదని చెప్పాడు.

అక్కడితో ఆగకుండా భారతీయ మహారాజులు, మొఘల్ చక్రవర్తులు ఇలా చోకర్‌ / నెక్లెస్‌లు ధరించేవారని కొన్ని ఫొటోలు కూడా షేర్‌ చేశాడు. మగవాళ్లు నెక్లెస్‌ వేసుకోరు అని ఎక్కడా లేదని.. అయితే ఫారిన్‌ కంట్రీస్‌లో ఎవరూ వేసుకోరు కనుక ఇది తప్పు అనుకుంటున్నారని చిన్నసైజ్‌ క్లాస్‌ పీకాడు. ఇదంతా చూస్తుంటే ముందగానే ఈ ప్రశ్న ఊహించి శిరీష్ రీసెర్చ్ చేశాకే ఆ నెక్లస్ ధరించాడని అర్థమవుతోంది.

సందీప్‌ X సంజయ్‌… సూపర్‌ ఫాస్ట్‌గా రెడీ అవుతోందట.. ప్లానింగ్‌ అలా ఉంది మరి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus