అల్లు శిరీష్ చెప్పిన పవన్ కళ్యాణ్ సీక్రెట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని ఆయన అభిమానులు వైభవంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ కి అల్లుడైన అల్లు శిరీష్ బర్త్ డే విషెష్ తో పాటు మామయ్యలో అతను పరిశీలించిన కొన్ని విషయాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

1. ప్రకృతి వైద్యుడుఆయుర్వేద వైద్యాన్ని పవన్ ఇష్టపడుతారు. అయన ఎక్కువగా ఉసిరికాయని తింటారు. అతని స్కిన్ ప్రకాశ వంతంగా ఉండడానికి అదే కారణం అనుకుంటున్నాను. ఒకసారి మామయ్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాను, అప్పుడు అతను వేపాకులను నమలడం గుర్తించాను. ఇక యాంటిబయాటిక్ మందులతో అవసరం ఏమి ఉంటుంది.

2. యోగిమేము తేలిక పాటి హతా యోగ చేస్తే, మామయ్య మాత్రం అష్టాంగ యోగా చేస్తారు. అందులో అతి కష్టమైన ఆసనాలు ఉంటాయి. ఆయన ఫిట్ నెస్ రహస్యం అదే. ఆసనాలు వేస్తున్నపుడు చూస్తే నాకు మామయ్య యోగిలా కనిపిస్తాడు.

3. పుస్తకాల పురుగుఓ సారి పవర్ స్టార్ వెళ్లే పుస్తకాల షాపుకి వెళ్లాను. ఎందుకు ఆయన పాలిటిక్స్, ఫిలాసఫీ, అంటూ సంబంధంలేని కాంబినేషన్లో పుస్తకాలు కొంటారని ఆ షాప్ క్లర్క్ నన్ను అడిగాడు. మామయ్యకు పుస్తకాలంటే పిచ్చని, అన్ని రకాల పుస్తకాలతో అతని ఇల్లు నిండిపోయి ఉంటుందని చెప్పాను.

4. సున్నిత మనసున్న వ్యక్తిమామయ్య పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడు. కానీ అయన మనసు చాలా సున్నితమైంది. నాకు 2007 లో కారు ప్రమాదంలో బాగా దెబ్బలు తగిలాయి. ఐసీయూ లో అడ్మిట్ చేశారు. అప్పుడు నన్ను చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో కన్నీటిని చూసి .. ఆత్మీయులకు ఏమైనా జరిగితే తట్టుకోలేరని అర్ధమయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus