శిరీష్ ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ అదరహో….

టాలీవుడ్ లో మెగా శిబిరం నుంచి వచ్చిన హీరోల్లో దాదాపుగా అందరూ సక్సెస్ అయ్యారు. అయితే సక్సెస్ కానీ అతి కొద్ది మంది హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. తొలి సినిమా పరాజయం కావడంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో మరోసారి ‘కొత్తజంట’ అనే సినిమాని చేశాడు. అయితే ఆ సినిమా సైతం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో చాలా గ్యాప్ తరువాత ‘శ్రీరస్తు శుభమస్తు” అనే సినిమాను షురూ చేశాడు. ఇదిలా ఉంటే ‘శ్రీరస్తు శుభమస్తు” సినిమా కొత్త షెడ్యూల్ ఫినిష్ చేసి ఖాళీగా ఉన్నాడు మన యువహీరో…ట్విటర్ లో తన తఢాకా చూపిస్తున్నాడు.

విషయం ఏంటంటే…ట్విటర్ లో అల్లు శిరీష్ దొరికినోల్లను దొరికినట్లు ఆడుకుంటున్నాడు…ఇంతకీ అల్లు శిరీష్ హ్యూమర్ కు అడ్డంగా బుక్ అయిన వారెవరో తెలుసా….మీరే చదవండి….ఈ మధ్యనే గెడ్డంతో తాను చేయించుకున్న ఒక షూట్ తాలూకు ఫోటో పెట్టాడు మెగా హీరో వరుణ్ తేజ్. అయితే ఫోటో చూసిన శిరీష్ ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశాడు. ”ఇక్కడ ఇటాలియన్ జి.క్యూ. మ్యాగజైన్ మోడల్ ఎవరో ఉన్నాడు. మా అందమైన.. పింకు రంగు చెంపలు.. కలిగిన కజిన్ ఏడబ్బా??” అంటూ మెగా ప్రిన్స్ ను ఒక ఆటాడుకున్నాడు. అదేక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీ.వి.కె. మనుమడు ”భారతదేశంలో అన్నీ తక్కువగానే ఉన్నాయట. మరి మన దగ్గర ఎక్కువగా ఉన్నది ఏంటో?” అన్న క్వెస్చన్ ను ట్వీట్ చెయ్యగా, మనోడు ”బ్రదర్.. మన దగ్గర పాపులేషన్ ఎక్కువగా ఉందిగా.. మనం వరల్డ్స్ యంగెస్ట్ కంట్రీ” అంటూ  శెటైర్ వేశాడు. ఇలా ఖాళీగా ఉన్న సమయంలో శిరీష్ ట్విటర్ లోని వాళ్ళను తన హ్యూమర్ తో నవ్విస్తున్నాడు. శిరీష్….నీ హ్యూమర్ అదిరింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus