టాలీవుడ్ హాట్ టాపిక్ అల్లు శిరీష్ ‘బేబీ సిస్టర్’.. ఓ యువకుడు
- May 1, 2017 / 01:54 PM ISTByFilmy Focus
అల్లు శిరీష్ వారి “బేబీ సిస్టర్” ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అయింది. ఈమె ఎవరో కాదు అక్కినేని అఖిల్ ప్రియురాలు శ్రియా భూపాల్. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారు కొంచెం దూరంగా ఉన్నారు. పెళ్లి క్యాన్సిల్ అయిందని వార్త చక్కర్లు కొడుతున్నప్పటికీ రెండు కుటుంబాల నుంచి అధికార ప్రకటన రాలేదు. గత కొంతకాలంగా మీడియా కంటికి కనిపించని శ్రియా భూపాల్ తాజాగా అల్లు శిరీష్ తో కలిసి ఫొటోలో దర్శనమిచ్చింది. అయితే ఆ ఫొటోలో అల్లు శిరీష్ తో ఉన్న క్లోజ్ నెస్ చూసి నెటిజనులు వారి మధ్య ఏదో ఉందని భావించారు. కొత్త జంట అంటూ కామెంట్స్ చేసిన వారు కూడా లేకపోలేదు.
దీంతో మైండ్ బ్లాక్ అయిన శిరీష్ ‘బేబీ సిస్టర్..’ అంటూ మరో ఫోటోని పోస్ట్ చేసాడు. ఇందులో కొంచెం డిగ్నిటిగా ఉన్నప్పటికీ మరో చర్చకి తెరలేపారు. ఇందులో అల్లు శిరీష్, బేబీ సిస్టర్ శ్రియా భూపాల్ మాత్రమే కాకుండా మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అని నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తనపై వస్తున్న విమర్సలను తప్పించుకోవడానికి శ్రియా భూపాల్ ని ఇరికించడం బాగానే ఉందిగానీ, ఆ యువకుడు ఎవరు? అనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















